Monday, January 20, 2025

మాదిగల ఓట్లే లక్ష్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎస్‌సిలలో ఉపకులమైన మాదిగ ఓట్లను ముఖ్యంగా ఈ వర్గం అధిక సంఖ్యలో ఉన్న తెలంగాణ, పంజాబ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వారి ఓట్లను తన బుట్టలో వేసుకోవడంపై అధికార బిజెపి దృష్టిపెట్టినట్లు గా కనిపిస్తోంది. ఎస్‌సిల వర్గీకరణపై కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం శుక్రవారం ఏర్పాటు చేయడానికి నేపథ్యం ఇదే. ఈ కమిటీలో హో మ్, న్యాయ వ్యవహారాలు, ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ తన నివేదికను సమర్పించడానికి కేంద్రప్రభుత్వం ఎలాంటి గడువును నిర్ణయించలేదు కానీ వీలయినంత త్వరగా తన పనిని పూర్తి చేయాలని మా త్రమే కోరింది.

ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధ ర్మాసనం ఎదుట కేసు నడుస్తున్న నేపథ్యంలోఈ సమస్య సమీప భవిష్యత్తులో లేదా కనీసం రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు పరిష్కారమయ్యే అవకాశాలు లే వు. వాస్తవానికి ఎస్‌సిల వర్గీకరణ అంశం 1994నుంచీ నలుగుతూనే ఉంది. గత న వంబర్ 30నజరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంద కృష్ణ మాదిగ నేతృత్వంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్‌సిల వర్గీకరణ కోసం మాదిగలు చేస్తున్న డిమాండ్‌ను పరిష్కరించడానికి కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం తెలిసిందే.

తెలంగాణలో మొత్తం జనాభాలో ఎస్‌సిలు దాదాపు 16 శాతం ఉన్నారు. వీరిలో అత్యధిక శాతం అంటే 65 70 శాతం మంది మాదిగలే ఉన్నారు. దీర్ఘకాలంగా నిర్లక్షానికి గురవుతున్న తమ కులానికి విద్య, ఉపాధి రంగాల్లో న్యాయం జరగాలలంటే ఎస్‌సిలను నాలుగు గ్రూపులు( ఎ,బి,సి,డి)గా వర్గాకరించాలని మాదిగలు డిమాండ్ చేస్తున్నారు. ఎస్‌సిలలో మాలల స్థితి బాగా ఉందని, రిజర్వేషన్లలో అత్యధిక ప్రయోజనాలు వీరే పొందుతున్నారనేది మాదిగల వాదన. అయితే పాతికేళ్లకు పైగా సాగుతున్న ఎస్‌సిల వర్గ్గీకరణ చరిత్రను బట్టి చూసినట్లయితే వీరిని నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గ్రూపులుగా విభజించడం అనేది అంత సులభమైన విషయం కాదని ఎవరికైనా అర్థమవుతుంది. ఎస్‌సిలను వర్గీకరించడానికి లేదా, ఉపకులాలకు వేరే కోటాలను ఇవ్వడానికి కానీ మాలలు ఎంతమాత్రం అంగీకరించక పోవచ్చు.

ఈ ప్రయత్నాన్ని వారు గట్టిగానే ప్రతిఘటించే అవకాశం కూడా ఉంది. ఎస్‌సిలను సబ్ గ్రూపులుగా విభజిస్తే రాజ్యాంగంలో పేర్కొన్న రిజర్వేషన్ల లక్షమే దెబ్బతింటుందని వారు వాదిస్తున్నారు. ఎస్‌సిల వర్గీకరణకు తొలి ప్రయత్నం 1996లో అప్పతటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు.1994నుంచి మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో రెండేళ్ల పాటు జరిగిన ఆందోళనకు స్పందనగా ఈ ప్రయత్నం చేశారు. అయితే ఈ ఉత్తర్వుల్లో బోలెడన్ని నిబంధనల ఉల్లంఘనలు, చట్టపరమైన లోపాలు ఉన్నాయని పేర్కొంటూ కోర్టులుఈ ఉత్తర్వులను కొట్టివేశాయి. అప్పటి నుంచి ఈ సమస్య నలుగుతూ వస్తూనే ఉంది. చివరికి సమస్య కేంద్రానికి, సుప్రీంకోర్టుకు కూడా చేరింది. అయితే కేంద్రం కూడా దీనిపై ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ లోగా పంజాబ్, తమిళనాడు, బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాలు ఎస్‌లను సబ్ గ్రూపులుగా విభజించడానికి ప్రయత్నించాయి కానీ న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసును విచారిస్తోంది. అయితే ఈ లోగా కేంద్రం ఈ సమస్య పరిష్కారానికి కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇది తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో మాదిగల ఓట్లను కొల్లగొట్టడానికి పన్నిన పథకమా లేక దీర్ఘకాలంగా నలుగుతున్న సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలన్న చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నమా అనేది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News