Thursday, January 23, 2025

సంపదను సృష్టించి పంచడమే ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

పాల్వంచ : తెలంగాణ రాష్ట్రంలో సంపదను సృష్టించి ప్రజలకు పంచడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని ప్రభుత్వ విప్, పినపాక ఎంఎల్‌ఏ రేగా కాంతారావు అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల పరిధి తోగ్గూడెంలో గల మిషన్ భగీరథ గ్రిడ్ వద్ద మంచినీళ్ళ పండగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. విప్ రేగా, ఎంఎల్‌ఏలు వనమా, హరిప్రియ, కలెక్టర్ అనుదీప్ ఇతర ప్రజా ప్రతినిధులు ముందుగా భగీరథ గ్రిడ్‌లో గల మోటార్లను, నీటిని శుద్ది చేయు విధానాన్ని, పైపు లైన్‌లను పరిశీలించారు. పంపింగ్ చేయు విధానాన్ని భగీరథ అధికారులను అడిగి తెలుసుకొన్నారు.

అనంతరం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ జిల్లాలో భగీరథ గ్రిడ్ ద్వారా ఇంటెక్ వెల్స్ మూడు, డబ్లూ టిపిలు ఐదు, ఓహెచ్‌బిఆర్‌లు 49, పంపులు 57, పైపు లైన్ 2796.29 కిలో మీటర్లు, ఖర్చు రూ.1,41,035.71 లు, మూడు పురపాలక సంఘాలకు, 1424 ఆవాస గ్రామాలకు, 98 రెసిడెన్సియల్ పాఠశాలలకు తాగు నీరు అందిస్తున్నారని, అలాగే మిషన్ భగీరథ ఇంట్రా విభాగంలో 818 ట్యాంకుల నిర్మాణం, 2223 కిలో మీటర్ల పైపులైన్ నిర్మాణం, 206843 నల్లా కనెక్షన్‌లు, 66 రైతు వేదికలకు, 1280 రూరల్ పాఠశాలలకు, 1699 అంగన్‌వాడీ కేంద్రాలకు, 404 వైకుంఠ ధామాలకు నీరందిస్తున్నట్లు తెలిపారు.

సిఎం కేసిఆర్ నేతృత్వంలో అనేక అభివృద్ధి పనులు తెలంగాణలో జరుగుతున్నాయన్నారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందన్నారు. గతంలో తాగునీటి కోసం ఆడపడుచులు పడుతున్న బాధలను తెలుసుకొన్న కళ్ళారా చూసిన కెసిఆర్ ముందు చూపుతో మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి తాగునీటిని అందిస్తూ తాగునీటి కష్టాలను దూరం చేశారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలో నెంబర్ వన్‌గా నిలి బెట్టిన ఘనత కేవలం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. దేశం మొత్తం కేసిఆర్ నాయకత్వాన్ని కోరుకొంటుందని ప్రజలు మరోసారి ముఖ్యమంత్రిగా కేసిఆర్ ను చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందు ఎంఎల్‌ఏ హరిప్రియ, జిల్లా అటవీ అధికారి రంజిత్ నాయక్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంధ్ర శేఖర్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, భగీరథ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News