Friday, December 20, 2024

అన్నివర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్

ఆమనగల్లు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ము ఖ్యమంత్రి కేసీఆర్ గొల్లకురుమలకు పెద్దపీట వేశారని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ అన్నారు. కులవృత్తులకు పునర్జువం కల్పించేందుకే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ఆయన తెలిపారు. వెల్దండ మండలం రాఘాయిపల్లి, చౌదరిపల్లి గ్రామాలకు చెందిన 12 మంది లబ్ద్ధిదారులకు సోమవారం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ గొర్రెలను పంపిణీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులకు చేయుతనందిస్తుందని తెలిపారు. కులవృత్తులు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నా రు. కురుమ, గోల్ల, యాదవులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేస్తుందని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు గాలమ్మ, రామస్వామి, బక్యనాయక్, ఎంపిటిసిలు వెంకటయ్య, మోత్యనాయక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News