Monday, January 20, 2025

ప్రతి పల్లెకు రహదారి సౌకర్యమే ప్రభుత్వ లక్షం

- Advertisement -
- Advertisement -
  • కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్

ఆమనగల్లు : కడ్తాల మండలంలో సోమవారం కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ స్థానిక ఎంపిపి దేపావత్ కమ్లీమోత్యనాయక్, జెడ్పిటిసి జర్పుల దశరథ్‌నాయక్, డిసిసిబి డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తాలతో కలిసి విస్తృతంగా పర్యటించారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో మంజూరైన 14.55 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. చల్లంపల్లి నార్లకుంట తాండాకు రూ.3.30 కోట్లు, చరికోండ, బోయిన్‌గుట్ట తాండాకు రూ. 2.10 కోట్లు, పిడబ్లూ రోడ్డు నుంచి వెలుగురాళ్ల తాండాకు రూ. 1.20 కోట్లు, మక్తమాదారం నుంచి నాగిరెడ్డి గూడ తాండాకు రూ 1.20 కోట్లు, అన్మాస్‌పల్లి నుంచి పుల్లేరుబోడు తాండాకు రూ. 1.20 కోట్లు, కడ్తాల నుంచి కానుగుబాయి తాండాకు రూ 1.20 కోట్లు, అన్మాస్‌పల్లి నుంచి పోచమ్మగడ్డ తాండాకు రూ.75 లక్షలు, వాస్‌దేవ్‌పూర్ నుంచి బాలాజీనగర్‌కు రూ. 1.50 కోట్లు, చల్లంపల్లి నుంచి రేకులకుంట తాండాకు 2.20 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని ముఖ్యంగా ప్రజలకు అవసరమయ్యే మౌళిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల కోసం కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులే తమ పనితీరుకు నిదర్శనమని ఆయన తెలిపారు.

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేత..

కడ్తాల మండలం వాస్‌దేవ్‌పూర్ గ్రామానికి చెందిన కోంటికి లక్ష, రావిచెడుకు చెందిన కరుణాకర్‌రెడ్డికి 22 వేలు, సాయితేజకు 28 వేలు, సాలార్‌పూర్ సరోజకు 16 వేలు, దేశీరాంకు 42 వేలు, శశికళకు 26 వేలు, కాడ్యతాండా లలితకు 45 వేలు, మౌనికకు 49 వేల చెక్కులను స్థానిక నాయకులకు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అందజేశారు.

ఆయా చోట్ల జరిగిన కార్యక్రమాలలో ఎంపిటిసిలు బోప్పిడి గోపాల్, బండి మంజుల చంద్రమోళి, లచ్చిరాంనాయక్, ప్రియారమేష్, సర్పంచులు నాగమణి వెంకోబ, లాల్‌కోట నర్సింహ్మగౌడ్, గుర్కా కృష్ణయ్య, కమ్లీబీచ్య, తులసీరాంనాయక్, హంసమోత్యనాయక్, సులోచనసాయిలు, పూజదేవనాయక్, శంకర్, నాయకులు జోగువీరయ్య, విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఉపసర్పంచ్ కడారి రామకృష్ణ, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News