Monday, December 23, 2024

రాహుల్‌ను పిఎం చేయడమే యూత్ కాంగ్రెస్ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే యూత్ కాంగ్రెస్ లక్ష్యమని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి అన్నారు. మల్కాజ్‌గిరి, చేవెళ్ల , హైదరాబాద్ , సికింద్రాబాద్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశం శనివారం గాంధీ భవన్ లో జరిగింది.

ఈ సందర్భంగా శివసేనా రెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలో యూత్ కాంగ్రెస్ గ్రామ స్థాయిలో పని చేస్తుందన్నారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం యూత్ కాంగ్రెస్ మీడియా, సోషల్ మీడియా విభాగం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు ,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News