ఖమ్మం : కొట్లాడి కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో తెలంగాణ లక్ష్యాలు నెరవేరలేని సి ఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బుధవారం రాత్రి నాయకన్ గూడెం చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ జరిగిన కార్నర్ సమావేశంలో మాట్లాడుతూ కృష్ణ, గోదావరి నదుల నుంచి పొలాల్లోకి పారాల్సిన నీళ్ళు రాకుండా బిఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుగా ఉందన్నారు .తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా అప్పులు చేసి రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టిన బిఆర్‌ఎస్ ను దింపి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.
ప్రశ్నించే గొంతుకులను ఇబ్బంది పెడుతున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపడానికే పీపుల్స్ మారక్స్ పాదయాత్ర అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ఆ పార్టీకి ద్రోహం చేసి వేలమంది ఓట్లను వేల కోట్ల కాంట్రాక్టుల కోసం పార్టీ మారరని ఆయన విమర్శించారు. ప్రజా ప్రతినిధి అంటే ప్రజల కోసం పనిచేయాలి తప్పా… ప్రభుత్వంతో బేరసారాలు పెట్టుకొని బ్రతకడం కాదన్నారు పాలేరు నియోజకవర్గం లో పేదల భూములు ఎట్ల కబ్జా చేస్తారని ఆయన ప్రశ్నించారు ధరణి పేరిట భూ అక్రమాలకు పాల్పడితే ఎలాగని ఆయన అన్నారు.నాగార్జునసాగర్ కాలువలపై ఉన్న మట్టిని ఎట్లా అమ్ముతారని ఆయన నిలదీశారు.
- పాలేరు కాంగ్రెస్‌కు కంచుకోట : సంభాని
పాలేరు కాంగ్రెస్ కంచుకోట అని మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అన్నారు. పాలేరు నుంచి సంభాని చంద్రశేఖర్, రాంరెడ్డి వెంకటరెడ్డి కత్తుల శాంతయ్య తదితరులు ప్రజల సొమ్మును పోగేసుకోకుండా ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేశారని ఆయన అన్నారు. ఉండటానికి సైతం ఇల్లు లేనటువంటి వారు పరిపాలన చేసిన ఎన్ని రోజులు అవినీతి మచ్చ లేకుండా ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు తెలంగాణ సమాజం ఏకం చేద్దాం ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం అని ఆయన అన్నారు.