Monday, December 23, 2024

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: దేవాలయాల అభివృద్ధ్దికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అ న్నారు. బుధవారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని అనుముల మండలం పేరూరు గ్రామంలోని శ్రీ స్వయంభూసోమేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సాగర్ నియోజకవర్గంలో కొత్తగా 14 అలయాలను నిర్మించామని, పేరూరుకు 50 లక్షలు, మారేపల్లికి 80 లక్షలు, ముప్పారంలోని దేవాలయాల అభివృద్ధికి 50 లక్షల నిధులను మంజూరు చేశామని , అదే విధంగా ప్రభత్వుం దూప,దీప, నైవేద్యాల కింద 10వేల రూపాయలు, పూజారులకు 6వేల రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తుందన్నారు. గత ంలో ఉమ్మడి రాష్ట్రంలో 1800 ఆలయాలు ఉంటే నేడు 601 4 ఆలయాలు ఉన్నాయన్నారు.

ఆలయా లు నిర్మించుకోవడానికి 10 లక్ష ల రూపాయలు ఇస్తున్న ఘనత కేసీఅర్‌ది అన్నారు. అనంతరం నియో జకవర్గంలోని 25 మంది పూజారులకు దూప, దీప, నైవేద్యం కింద నియామక పత్రాలను అందజేశారు. అంతకు ముందు అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు.

కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మున్సిపాలిటీ చైర్మన్లు వెంపటి పార్వతమ్మశంకరయ్య, కర్ణ అనూషశరత్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, కూరాకుల వెంకటేశ్వర్లు, బహునూతల నరేందర్, యడవల్లి మహేందర్‌రెడ్డి, దూళిపాల రామచంద్రయ్య, నల్లగొండ సుధాకర్, మంద రఘువీర్, బిన్ని, రాయనబోయిన రామలింగయ్య, కర్ణ బ్రహ్మారెడ్డి, కౌన్సిలర్లు నల్లబోతు వెంకటయ్య, ప్రసాద్‌నాయక్, చాపల సైదులు, సుధారాణినాగరాజు, వెంకట్‌నారాయణ, అంబడి నాగిరెడ్డి, మేరెడ్డి వెంకట్‌రెడ్డి, సంధ్యరామునాయక్, గోనే నరేందర్‌రావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News