Monday, January 20, 2025

క్రైస్తవులకు అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -
  • మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు

సిద్దిపేట: తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. సోమవారం పట్టణంలోని గాడిచర్లపల్లి శివారులో షాలేము క్యాంపస్ షాలేము సహవాస నాయకులు, పాస్టర్ స్టీవెన్ జ్ఞాన కుమార్ ఆధ్వర్యంలో జిల్లా పాస్టర్స్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ్రక్రిస్టమస్‌ను అధికారికంగా జరుపుతున్నారని తెలిపారు. మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లాను రాష్ట్రానికి తలమాణికంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. అదేవిధంగా పాస్టర్లు పలు సమస్యలు తెలుపగా మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. కరోనా సమయంలో స్టీవెన్ జ్ఞాన కుమార్ పేద పాస్టర్లకు బియ్యం, వితంతువులకు ,వృద్దులకు దుప్పట్లు , బట్టలు పంపిణీ చేసి తన సేవా గుణాన్ని చాటారన్నారు. పాస్టర్లు మోహనబాబు, ప్రసార్ చౌద్దరి, జోయేల్ జెశ్వంత్, కౌన్సిలర్లు సద్ది నాగరాజు రెడ్డి, నాయకులు లతతక్ష్మన్, ఎడ్ల అరవింద్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు వజీర్, మోయిజ్ , జిల్లా పాస్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News