Monday, December 23, 2024

ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుంది : ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం రాష్ట్ర ప్రభుత్వానికి పట్టుకుందని.. అందుకే అన్ని వర్గాలను మచ్చిక చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో మాకు గది ఇవ్వకపోవడం. బిఎసికి పిలవకపోవడం అంటే మమ్ముల్ని కాదు అసెంబ్లీని అవమానించడమే అన్నారు. సమైక్య పాలకులకు ఉన్న సోయి కెసిఆర్ ప్రభుత్వానికి లేదన్నారు. ‘గతంలో ఒక్క సభ్యుడు ఉన్నా బిఎసికి పిలిచేవారు. బిజెపి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా ఇప్పుడు పిలవడం లేదు. అసెంబ్లీలో చాలా రూములు ఖాళీగా ఉన్నా.. మాకు కేటాయించలేదు. ఇవాళ స్పీకర్‌కు ఫోన్ చేసి అడిగినా జవాబు లేదు. మేము అసెంబ్లీ ఎదురుగా ఉన్న నిజాం క్లబ్‌లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సభ మూడు రోజులే జరుగుతుందని అంటున్నారు. 6 నెలలకు ఒకసారి సభ జరగాలి కాబట్టి నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిపై సభలో చర్చించాల్సిన అవసరం ఉంది. వర్షాలకు పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో కలుపుతామని అంటున్నారు. రోజురోజుకూ ఆర్టీసీ బస్సులను ప్రైవేటుపరం చేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులను తొలగించారు. ఆర్టీసీ ఉద్యోగులను మభ్యపెట్టేందుకే విలీన ప్రకటన చేశారు. 18 వేల మంది వీఆర్‌ఎ, వీఆర్వోలను వేరే విభాగాలకు పంపాలని చూస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామంటున్నారు. నాలుగేళ్లుగా చేయనిది.. ఈ రెండు నెలల్లో చేస్తారా? ‘ అని ఈటల వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News