Tuesday, December 24, 2024

బోనాలకు ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -
  • వైభవంగా ఫలహారం బండి ఊరేగింపు
  • ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి

శివ్వంపేట: గోమారంలో బోనాల పండుగ ఉత్సవాల భాగంగా మరసటి రోజు ప్రతి ఏ టా నిర్వహించే ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి నియోజకవర్గ మండల ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు అధిక సం ఖ్యలో హాజరై అమ్మవారి తొట్టెల ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి వారి కుమారులు వాకిటి శ్రీనివాసరెడ్డి వాకిటి శశిధర్ రెడ్డిలువారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వచ్చిన అతిథులకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. పలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జెడ్పిటిసి పబ్బ మహేష్ జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, పలువురు ప్రజా ప్రతినిధులచే కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు హిందూ ధర్మ భక్తి సాంసృతి వ్యాప్తికి తెలంగా ణ ఆధ్యాత్మిక వైభవాన్ని ఎలుగెత్తి చాటేలా బోనాల ఉ త్సవాలను ప్రోత్సహించినందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బోనాల ఉత్సవాలను ప్రతి ప్రాంతంలో నిర్వహించుకోవడం మానవాళికి వస్తుందని ఈ పండుగ తరహా ఉత్సవాలలో ప్రోత్సహించడం భక్తి భావాలను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమని దీనితో పల్లెల్లో భక్తి భావం పెంపొందించుకోవడంతో పాటు వారి జీవన స్థితిగతులు మారుతాయి అని అన్నారు మా ఇలవేల్పు అమ్మవారి పలహారం బండి కొన్ని సంవత్సరాల నుండి మా ఇంటి నుండి తీయడం ఆనవాయితీగా వస్తుందని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఫలహా రం బండిని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుతో ర్యాలీగా పోతరాజుల విన్యాసాలతో డబ్బు చప్పులతో డిజె సౌండ్ సిస్టంతో ప్రత్యేక లైటింగ్ సిస్టంతో చూపురులకు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి జెడ్పి కోఆప్షన్ సభ్యులు మ న్సూర్,నర్సాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, పార్టీ కోశాధికారి బండారి గంగాధర్, సర్పంచులు చంద్రకళ శ్రీశైలం యాదవ్, బోళ్ల భారతి బిక్షపతి అశోక్ రెడ్డి, ఎంపిటిసి నరసింహారెడ్డి, కో ఆప్షన్ లాయక్, మెదక్ జిల్లా బిఆర్‌ఎస్ వి అధ్యక్షులు సుధీర్ రెడ్డి, వాకిటి హనుమంత రెడ్డి బిక్షపతి రెడ్డి మైపాల్ రెడ్డి, సంతోష్ రెడ్డి, నరసింహారెడ్డి, మర్రి మహేందర్ రెడ్డి, చిలివేరి వీరేశం, పవన్ గుప్తా, రామచంద్రం గౌడ్, రాజేందర్ నాయక్, రాకేష్ రెడ్డి, నియోజకవర్గం బిఆర్‌ఎస్ నాయకులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News