Monday, December 23, 2024

ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అన్ని రంగాల్లో పెద్ద పీట వేసిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి జామె మసీదు కమిటీ ఆధ్వర్యంలో బుధవారం శాలువాతో సత్కరించి పూలబొకేను అందచేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముస్లిం పేదింటి ఆడపడుచుల పెళ్లి కోసం షాదీ ముబాకర్, నర్సంపేటలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల ఏర్పాటు చేయడం, రూ. కోటితో ముస్లిం షాదీఖానా నిర్మించడం జరుగుతుందన్నారు. నేను గతంలో ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే నర్సంపేట అభివృద్ధి ఊహించని స్థాయిలో ఉండేదన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా మెడికల్ కళాశాల, పాకాల ప్రాజెక్టు, గోదాముల నిర్మాణం, 250 పకడల ఆసుపత్రి, కావల్సినన్ని గురుకుల పాఠశాలలు, ప్రతీ రంగంలో 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని గెలిచిన మొదటి సారి చేశానన్నారు.

ఇదే విధంగా నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం అహర్నిశలు శ్రమించి నర్సంపేట అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జామె మసీద్ కమిటీ అధ్యక్షుడు ఎండీ అబ్దుల్ నబీ, కార్యదర్శి ఎండీ హబీబ్‌పాషా, పట్టణ బీఆర్‌ఎస్ మైనార్టీ అధ్యక్షుడు షేక్ ఇర్ఫాన్, కార్యదర్శి ఎండీ అజిజోద్దిన్, కౌన్సిలర్ ఎండీ మహబూబ్‌పాషా, కోఆప్షన్ షేక్ యాకూబ్, ఖలీల్, ఎండీ నిజాం, ఎండీ హఫీజ్, ఎండీ అజ్మత్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News