ఉప్పల్: కల్యాణలక్ష్మి పథకంతో ఆడబిడ్డల ఇళ్లలో సర్కారు వెలుగులు నింపుతోందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. హబ్సిగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 227 మంది లబ్ధిదారులకు రూ.2.27కోట్ల నిధుల చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్షంగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల్లోకి వెళుతుందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు సిఎం కెసిఆర్ భరోసా ఇచ్చారని పేర్కొన్నారు.
కరోనా వంటి వివత్కర పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వెనకడుగు వేయలేదన్నారు. దేశంలోనే తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో ముందు వరుసలో ఉందన్నారు. ఉప్పల్, కాప్రా సర్కిల్ పరిధిలో కార్పొరేటర్లు ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించడంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంంలో ఉప్పల్ తహశీల్దార్ వెంకట నర్శింహరెడ్డి, ఆర్‌ఐ సుధా, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్‌రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, బిఆర్‌ఎస్ నాయకులు వేముల సంతోష్‌రెడ్డి, అరటికాయల భాస్కర్, లేతాకుల రఘపతి పాల్గొన్నారు.