Wednesday, January 22, 2025

గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

- Advertisement -
- Advertisement -

జైనూర్: ఆదివాసి గిరిజనుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జైనూర్ మండలం మార్లవాయిలో నిర్వహించిన గిరిజన ఉత్సవం కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు, నిర్మల్ కలెక్టర్, ఐటిడిఎ ఇంచార్జ్ పిఓ వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ చాహత్‌భాజ్‌పాయ్, జడ్పిచైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎస్పీ సురేష్‌కుమార్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పద్మశ్రీ కనకరాజు, రాష్ట్ర మహిళ కమీషన్ సభ్యురాలు కుమ్రం ఈశ్వరిబాయి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావుతో కలిసి ముఖ్య ఆతిథిగా హాజరయ్యారు.

ముందుగా గుస్సాడి నృత్యానికి సంబంధించిన కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. దీనిలో భాగంగా గిరి వికాసం పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు.

గిరిజనులకు అండగా ఉండే జీవో నెంబర్ 3 తిరిగి అమలు చేసే దిశగా ప్రయత్నం చేస్తామని అన్నారు. త్వరలో జిల్లాకు రానున్న సీఎం కేసిఅర్ చేతుల మీదుగా గిరిజనులకు పోడు పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు. గిరిజన జిల్లా ఏర్పాటు చేసి అభివృద్ధ్ది దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

మార్లవాయి గ్రా మంలో మిని ట్యాంక్‌బందడ్ ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మార్లవాయిలో గిరి వికాసం ద్వారా 30 మందికి లబ్దిచేకురుస్తున్నమని, రానున్న రోజుల్లో మరింత మందికి అవకాశం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News