Wednesday, January 22, 2025

పునర్వినియోగ ప్లాస్టిక్ పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

- Advertisement -
- Advertisement -
ఐటి,పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేష్ రంజన్

హైదరాబాద్: పునర్వినియోగ ప్లాస్టిక్ పరిశ్రమ యొక్క స్థిరమైన అభివృద్ధికి మరియు ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏఐపిఎంఎ)ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ప్లాస్టిక్ పరిశ్రమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని కోరారు.ప్లాస్టిక్‌పై జిఎస్‌టిని ప్రస్తుత 18% నుండి 12%కి తగ్గించాలని నిర్వహకులు విజ్ఞప్తి పై ఆయన స్పందిస్తూ రాష్ట్ర ఆర్దిక మంత్రి జిఎస్‌టి కౌన్సిల్ సభ్యుడైన ఆర్దిక మంత్రి హరీష్ రావుతో ఈ విషయాన్ని చర్చిస్తానని హామీఇచ్చారు.మనం ప్లాస్టిక్‌ని రోజు విడిచి రోజు వినియోగిస్తున్నా, అవి లేని జీవితాన్ని ఊహించుకోలేమన్నారు.రాష్ట్రంలో 10,000 ప్లాస్టిక్ యూనిట్లు ఉన్నప్పటికీ, చాల కంపెనీలో తాప్మా(తెలంగాణ మరియు ఆంధ్రా ప్లాస్టిక్ తయారీదారుల సంఘం) సభ్యత్వం తీసుకోక పోవడమే కాకుండా నిబంధనలను పాటించడం లేదన్నారు. అటువంటి వాటిని తాప్మా చేర్చుకోవడం మీ కర్తవ్యమన్నారు.ఈ కార్యక్రమంలో టిఎస్‌ఐఐసి ఎండి ఇ.వెంకట్ నర్సిహ రెడ్డి ,అసోసియేషన్ ప్రతినిధులు అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News