Friday, December 27, 2024

గంగపుత్రుల సంక్షేమానికి సర్కారు పెద్దపీట

- Advertisement -
- Advertisement -

మంథని: సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు తెలంగాణ రాష్ట్రమేనని, కులాచారాలు ప్రకారం అమ్మవార్లకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని మున్సిపల్ చైర్మెన్ పుట్ట శైలజ అన్నారు. ఆదివారం ఆశాడ బోనాల సందర్భంగా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని బోయిన్‌పేట నుంచి గోదావరి నది వరకు చేపట్టిన బోనాల జాతరలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గంగపుత్రులు బోనాలు ఎత్తుకొని వలలు చేతపట్టుకొని డప్పు చప్పుళ్లతో గోదావరినది వరకు ప్రదర్శనగా బయలు దేరి వెళ్లారు. అక్కడ గోదారమ్మకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ ప్రతి ఏటా గంగపుత్రుల తమ కుల ఆచారం ప్రకారం గంగమ్మతల్లికి బోనాలు సమర్పిస్తున్నారని అన్నారు. మన రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గంగపుత్రుల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువులు, గోదావరి నదుల్లో చేప పిల్లలను పెంచి మత్సకారులకు ఉపాధి మార్గాలు చూపించారని అన్నారు. అత్యవసర నిమిత్తం హైదరాబాద్ వెళ్లినా ఇక్కడి గంగపుత్రుల ఆహ్వానం మేరకు మీ ఇంటి ఆడబిడ్డగా బోనాల జాతరకు హాజరయ్యానని అన్నారు. గంగమ్మ తల్లి బోనాల జాతరలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. గంగమ్మ తల్లి దీవెనలు అందరిపై ఉండాలని, గంగపుత్రులు సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా వేడుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News