Monday, December 23, 2024

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -

ఇల్లందు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని స్థానిక శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియా హరిసింగ్‌నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక మార్కెట్ యార్డులో నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో గుర్తించిన మహిళల సమస్యలను అనేకం ఈనాడు ముఖ్యమంత్రి కేసిఆర్ పరిష్కరించారన్నారు.

మహిళలకు అన్నిరంగాల్లో ప్రాధాన్యతనిస్తూ వారి గౌరవ వేతనాలను పెంచారన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. అంతకముందు ఎంఎల్‌ఎకు మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు, మహిళలు ఏర్పాటుచేసిన స్టాళ్ళను ఎంఎల్‌ఎ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ అంగోత్ బిందు, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, వైస్‌చైర్మన్ జానీపాష, మున్సిపల్ కమిషనర్ అంకుషావళి, తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపిడిఒ బాలరాజు, సిడిపిఒ లక్ష్మిప్రసన్న, ఎమ్‌పిపి చీమల నాగరత్నమ్మ, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ లాల్‌సింగ్, రైతు సమన్వయ సమితీ సభ్యులు పులిగళ్ళ మాధవ్‌రావు, డిసిసిబి డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, పలువురు మున్సిపల్ కౌన్సిలర్‌లు, సర్పంచ్‌లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News