Monday, December 23, 2024

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి సిఎం కెసిఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. టియుడబ్ల్యూజె (ఐజెయు) ఖమ్మం నగర కమిటీ, ఖమ్మం ప్రెస్ క్లబ్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సౌజన్యంతో బుధవారం ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.మాలతి, టియూడబ్ల్యూజె (ఐజేయు) జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రామనారాయణ ప్రారంభించారు.

కంటి వెలుగు శిబిరాన్ని, కంటి పరీక్షలను ప్రారంభించి రీడింగ్, సైట్ కంటి అద్దాలు కొన్నింటిని అప్పటికప్పుడే అందజేశారు. జర్నలిస్టు యూనియన్ ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మైస పాపారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధిని కేటాయించడంతోపాటు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కంటి వెలుగు పథకం ద్వారా రాష్ట్రంలో లక్షలాది మందికి ఉచితంగా కంటి అద్దాలు అందిస్తూ చూపును ప్రసాదిస్తున్నారని లింగాల కమల్ రాజు అన్నారు. ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు.

జర్నలిస్టులతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని, పదేళ్లలో ఎన్నో అద్భుత విజయాలు సాధించారని పేర్కొన్నారు. ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారధ్యంలో త్వరలో ఖమ్మంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కళ సాకారం కానుందని పేర్కొన్నారు. టియుడబ్ల్యూజె (ఐజేయు) జర్నలిస్ట్ యూనియన్ తోనే జర్నలిస్టుల సంక్షేమం ముడిపడి ఉందని రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రామనారాయణ పేర్కొన్నారు. కంటి వెలుగు శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. మరిన్ని పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన శిబిరంలో మొత్తం 94 మంది( పురుషులు 57, మహిళలు 37 ) పరీక్షలు చేసుకుని కంటి అద్దాలు పొందారు. విజయవంతంగా సాగిన ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.మాలతి, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రాంబాబు, జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ గోగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటేటి వేణుగోపాల్, సామినేని మురారి, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు మైసా పాపారావు,కార్యదర్శి, అక్రిడేషన్ కమిటీ మెంబర్ చెరుకుపల్లి శ్రీనివాస్, ఖమ్మం ప్రెస్ క్లబ్ కార్యదర్శి కూరాకుల గోపి, కోశాధికారి నామ పురుషోత్తం, ఖమ్మం నగర కమిటీ కోశాధికారి రాయల బసవేశ్వర రావు, జిల్లా నాయకులు యేగినాటి మాధవరావు, ఎండి మొయినుద్దీన్, జనార్ధన చారి, ఏలూరి వేణుగోపాల్, సందీప్, కొమ్మినేని ప్రసాదరావు, కళ్యాణ్ చక్రవర్తి, పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పాల్గొన్నారు. కంటి వెలుగు శిబిరంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ నిత్య, ఆప్తమెట్రిస్ట్ డాక్టర్ లోహిత, పారామెట్రిక్ ఆప్తాలమిక్ ఆఫీసర్ లు డాక్టర్ ప్రవీణ్, వీణ, వైద్య సిబ్బంది, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.

జర్నలిస్టులు, జర్నలిస్టుల కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరం ఖమ్మం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఈనెల 8న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుందని టి డబ్ల్యూ జే ఐ జేయు ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మైస పాపారావు, ఖమ్మం నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్ తెలిపారు. జర్నలిస్టులు, జర్నలిస్టుల కుటుంబాల వారు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు విధిగా ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News