Thursday, January 23, 2025

దివ్యాంగుల పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే

- Advertisement -
- Advertisement -

ఇందల్వాయి: దివ్యాంగుల సంక్షేమ బాధ్యత ప్రభుత్వానిదేనని దివ్యాంగుల సంతోషమే బిఆర్‌ఎస్ విజయమని రూరల్ ఎంఎల్‌ఏ, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇందల్వాయిలోని సాయిబాబా మందిరంలో బుధవారం దివ్యాంగుల రూరల్ కన్వీనర్ మైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సభకు ఎంఎల్‌ఏ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఇందల్వాయి సాయిబాబా ఆలయంలో పూజలు చేశారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం సిఎం కెసిఆర్ పెన్షన్లు పెంచారని అన్నారు. రూరల్ మండలంలో పిజికల్ అండ్ క్యాస్ట్ దివ్యాంగులకు స దరన్ క్యాంపులు త్వరలో పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం దివ్యాంగులు ఆర్టీనరీ, ఎక్స్‌ప్రెస్, డీలక్ప్ బస్సుల్లో ప్రయాణించవచ్చని, అందుకు దివ్యాంగులకు ప్రభుత్వం 50శాతం కట్టేదని ఇపుడు తానే సొంతంగా డబ్బులు కడతానని వారికి భరోసానిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News