Wednesday, January 22, 2025

విద్యకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

కల్వకుర్తి రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. బుధవారం కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామంలో మన ఊరు మన బడి పథకం కింద 68 లక్షలతో నూతనంగా నిర్మించే పాఠశాల భవన నిర్మాణ పనులు ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులను వేగవంతంగా, నాణ్యతగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రాంభించారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మెన్ సింగం విజయ్ గౌడ్, ఎంపిపి సామ మనోహర, వైస్ ఎంపిపి కొండూరు గోవర్ధన్, సర్పంచ్ పాండు గౌడ్, పాఠశాల హెచ్‌ఎం, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News