Wednesday, January 22, 2025

స్టాఫ్ నర్సుల ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

మెరిట్ జాబితాను సిద్ధం చేసిన మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు
త్వరలోనే సిఎం రేవంత్ చేతుల మీదుగా ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేత
దీనిని పండుగలా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయం

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరలోనే 7 వేల నర్సు పోస్టులు భర్తీ చేయనుంది. పూర్తి స్థాయి కసరత్తు తర్వాత మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఫైనల్ మెరిట్ లిస్టును తయారు చేసింది. రెండు, మూడు రోజుల్లో దానిని అధికారులు ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఎల్బీ స్డేడియంలో సిఎం చేతుల మీదుగా నియామక పత్రాలు పంపిణీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆఫీసర్లు సన్నద్ధం అవుతున్నట్లు తెలిసింది. కొత్త ప్రభుత్వంలో చేయబోతున్న మొదటి నియామకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనిలో భాగంగానే నియామక పత్రాలను పండుగలా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.
డిసెంబర్ 15న 6,890 పోస్టులకు నోటిఫికేషన్
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 204 స్టాఫ్ నర్సు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి ఆగస్టు 2వ తేదీన పరీక్ష నిర్వహించారు. 40,936 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 38,674 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రభుత్వం మారిన తర్వాత డిసెంబర్ 15వ తేదీన ఆ నోటిఫికేషన్‌లో మరో 6,890 పోస్టులను కలిపారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కు పెరగ్గా, ఇప్పుడు ఇవన్నీ భర్తీ చేయనున్నారు. వీటిలో డిఎంఈ పరిధిలో 5,650 పోస్టులు, టివివిపిలో 757, ఎంఎన్‌జే, గురుకులాల్లో మిగతా పోస్టులు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News