Wednesday, January 22, 2025

గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -

మిడ్జిల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల అభివృద్ధికి సిఎం కెసిఆర్ పెద్దపీట వేశారని జడ్పీటీసీ శశిరేఖ బాలు, ఎంపీపీ సుదర్శన్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని వాడ్యాల గ్రామంలో ఎంపీపీ నిధులతో మంజురైన రూ.2 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను మండల నాయకులతో కలిసి వారు ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ పట్టణాలకు ధీటుగా గ్రామాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో అధికంగా నిధులు కేటాయిస్తూ గ్రామాలను అభివృద్ది పరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంగమ్మ శ్రీనివాసులు నర్సింహ, సుకుమార్, వెంకటయ్య, జంగయ్య, కృష్ణయ్య, సత్యనారాయణ, వెంకటయ్యగౌడ్, జనార్ధన్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News