Sunday, December 22, 2024

పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట : పేద ప్రజల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ప్రభుత్వ విప్, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రూ. 10లక్షల 4000ల విలువైన 28 మంది లబ్ధిదారులకు అదే విధంగా ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు కార్యకర్తలకు రూ. 4 లక్షల విలువైన 2 పార్టీ ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల అభ్యున్నతి అభివృద్ధ్ది సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నాని, వారికి అన్ని విధాలుగా సహయ, సహకరాలు అందిస్తూ తోడ్పాటు ఇస్తున్నారన్నాఉ. ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన చింతల సైదులు సన్నాఫ్ బసవయ్య, అదే విధంగా అచ్చంపేట పట్టణంలోని 3వ వార్డుకు చెందిన బండారు రమేష్ ప్రమాదవశాత్తు మరణించగా బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చెక్కు బాధిత కుటుంబ చెక్కులను అందజేశారు. పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణించిన ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి పార్టీ ప్రమాద బీమాలను రూపొందించి వారికి ఆర్ధిక సహయం అందిస్తూ అండగా ఉంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, చెక్కు లబ్ధ్దిదారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News