Monday, December 23, 2024

విద్యా వ్యవస్థను నీర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

జఫర్‌గడ్ : ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకుండా ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ఆల్‌ఇండియా ఫ్రొఫెషనల్ కాంగ్రెస్ సభ్యు లు డా బొల్లెపల్లి క్రిష్ణ అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణలో శ్రమదానం చేపట్టి పిచ్చి మొక్కలను తొలగించారు. పాఠశాల విద్యార్థులకు, అంగన్ వాడీ చిన్నారులకు చాక్లెట్లు, పండ్లు, పెన్నులు, పెన్సిల్లు, రబ్బర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రిష్ణ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌళిక వసతులను కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆయాలను నియమించని దుస్ధితిలో ప్రభుత్వం ఉందన్నారు. అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లు పిల్లల అనారోగ్యానికి కారణమవుతున్నాయని అన్నారు. కనీస వసతులు లేక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో మాత్రం చేసింది శూన్యమన్నారు. 2009 విద్యా హక్కు చట్టాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. నిరుపేద విద్యార్థులకు ఉచిత నిర్భంద విద్యను అందిస్తూనే ప్రయివేటు పాఠశాలలో 25 శాతం సీట్లు నిరుపేద విద్యార్థుల కోసం కేటాయించాలన్న నిబంధన అమలు కావడం లేదన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వి ద్యా వ్యవస్థను పట్టిష్టం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బేతి జైపాల్ రెడ్డి, మాజీ జడ్పిటిసి సభ్యుడు పట్టపూరి స దయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు నంచర్ల యాదగిరి, ధర్మసాగర్ మండల మాజీ అధ్యక్షుడు తూటి నర్సింహరెడ్డి, టౌన్ అధ్యక్షుడు మంచోజు యాదగిరి, వార్డు సభ్యులు మంచాల మమత అనిల్, కుక్కల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News