Monday, December 23, 2024

తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: తెలంగాణ సాధనలో అమరులైన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి గౌరవించి పెద్ద పిట వేసి ఆదుకున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టరేటు సమావేశ మందిరంలో అమరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, వారి ఆత్మలకు శాంతి కలిగేలా రెండు ని మిషాలు మౌనం పాటించారు.తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో దశలలో ఉద్యమాలు జరిగాయని, రాష్ట్ర సాధనలో ఎందరో అమరులయ్యారని, తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న తరువాత ముఖ్యమంత్రి అమరుల కుటుంబాలను ఆదుకుని గౌరవించారని అ న్నారు. జిల్లాకు చెందిన 33 అమరుల కుటుంబాలను ఆదుకోవడం జరిగిందని అన్నారు. మరలి దశ తెలంగాణ ఉద్యమంలో కాసోజు శ్రీకాంతా చారిది మొదటి త్యాగమని, మన జిల్లాకు చెందిన వారని కొనియాడారు.నేడు ముఖ్యమంత్రి హైదరాబాదులో అమరుల కు టుంబాలను సన్మానిస్తున్నారని, వారిలో శ్రీకాంతా చారి తల్లి తో పా టు మరి కొంతమందికి కూడా సన్మానించుకుంటున్నట్లు తెలిపారు.

అమరుల త్యాగాలను గుర్తు చేస్తూ వారి కుటుంబాలకు మనో ధైర్యం కలుగాలని కోరుతున్నానని అన్నారు.జిల్లా కలెక్టరు పమేలా సత్పథి మాట్లాడుతూ… 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని ఈనెల 2 నుండి 22 వరకు ఊరూరా, వాడవాడలా అందరికి తెలియపరుస్తూ సంబరాలు జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా అమరుల కుటుంబాలనుసన్మానించుకుం టున్నామని అన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరులు ఎండ్లపల్లి దయాకర్ రెడ్డి, బానోతు ధారాసింగ్, కావడి కృష్ణ, బోస్కు అనిల్, సయ్యద్ మహబూబ్ అలీ, గుంటి సతీష్, భానుప్రసాద్, ఓరుగంటి వేణు, మోతె రాంరెడ్డి, గంధమళ్ల రాములు, బానోతు లక్పతి నాయక్, ధరావత్ సుధాకర్ నాయక్,తోడేటి కైలాసం, దార ఏట స్వామి,కోల ధనమ్మ, తుంగ శ్రీ నివాస్, కన్నెబోయిన మల్లేశ్, గంధమళ్ల సురేందర్, సుర్వి శివకుమా ర్, బాతరాజు వినేశ్, బోయ శ్రీధర్, షేక్ అన్వర్ పాషా, జువ్వి భిక్షపతి, పల్సం లోకేష్, వరాల పాండు, భద్రి రాములు, కోడెం చంద్రమౌళి, పెదకంటి వీరాచారి, బొడిగె కుమార్, కూనూర్ శేఖర్ కుటు ంబ సభ్యులను సన్మానించారు.

కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన మధ్యాహ్నం భోజనంలో తెలంగాణ అమరవీరుల కు టుంబ సభ్యులకు జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా కలెక్టర్, జిల్లా స్థానిక స ంస్థల అదనపు కలెక్టర్, ప్రజా ప్రతినిధులు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివా రి, రెవెన్యూ అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఏనబోయిన ఆంజనేయులు, ఎంపీపీ నరాల నిర్మల, జెడ్పి టిసి సభ్యుడు బీరు మల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News