Friday, December 20, 2024

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -
  • కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్

ఆమనగల్లు : ముఖ్యమంత్రి కెసీఆర్ నాయకత్వంలో ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ అన్నారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో దేవాలయాల అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ దేవాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు.

మైసిగండి మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, వేదపారాయణం, హోమం, పూర్ణహుతిని అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలో యాదగిరి గుట్ట లక్ష్మీనర్సింహ్మస్వామి ఆలయంతోపాటు వేములవాడ రాజన్న, వరంగల్లు భద్రకాళి, ఐనవోలు కోమరవెల్లి మల్లన్న తదితర పురాతన దేవాలయాల పునరుద్ధరణ జరుగుతుందన్నారు. దూప, దీప నైవేద్యాలకు నోచుకోని చిన్న చిన్న ఆలయాలు, గోపురాలు నేడు కళకళలాడుతున్నాయని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి దేవాలయాన్ని పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రాంత అభివృద్ధికి మరింత కృషి చేసేందుకు తాను సిద్ధమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టు చైర్మన్ రమావత్ శిరోలి పంతూనాయక్, ఈవో స్నేహలత, సర్పంచ్ రమావత్ తులసిరాంనాయక్‌ల అధ్వర్యంలో అతిథులను ఆలయ మర్యాదలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలను అందించారు.

కార్యక్రమంలో ఎంపిపి దేపావత్ కమ్లీ మోత్యనాయక్, జెడ్పిటిసి జర్పుల దశరథ్‌నాయక్, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపిపి బావండ్లపల్లి ఆనంద్, సర్పంచ్ గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి, కల్వకుర్తి ఆర్డీవో రాజేష్, ఎంపిడిఒ కె. రామకృష్ణ, సీఐ జాల ఉపేందర్, ఏసై హరీష్ శంకర్‌గౌడ్, అర్చకులు మాదారం యాదగిరి, అమూల్యపతి, సంతోష్‌కుమార్ శర్మ, భానుప్రకాష్ శర్మ, నాగేంద్ర శర్మ, వెంకటరమణ, కేశవాచార్యులు, ఆలయ సిబ్బంది బోడ్యనాయక్, కృష్ణయ్య, చంద్రయ్య, రాములు, దేవేందర్, రమాదేవి, శ్రీనివాస్, శ్రవణ్‌కుమార్, పత్య, హర్షవర్థన్, కృష్ణయ్య, వెంకటేష్, శ్రీనివాసులు, చారి, రామకృష్ణ, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News