Friday, November 15, 2024

పురపాలికలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

పరిగి: మున్సిపల్‌లో పలు సమస్యలను పరిష్కరించి ప్రజలకు మంచి సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నామని పరిగి ఎ మ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ప రిధిలోని 11, 12, 15వ వార్డులలో బస్తీ బాట కార్యక్రమాన్ని స్థానిక ఛైర్మన్ ముకుంద అశోక్ ఆధ్వర్యంలో ఆయా వార్డుల కౌన్సిలర్‌లు, నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు వార్డులలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. శిలాఫలకాల ఆవిష్కరణ, బస్తీలలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటు వెంటనే సంబంధిత శాఖ అధికారులతో, కౌన్సిలర్‌లతో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం పురపాలక సగానికి కేటిఆర్ రూ.25 కోట్ల నిధులు మంజూరు చేశారని ఈ నిధులతో అన్ని వార్డులలో నూతన మంచి నీటి ట్యాంకులు, బోర్ బావులు, అండర్ డ్రైనేజీలు, సిసి రోడ్లు, వీది దీపాలు, తదితర వాటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
11వ వార్డులో బస్తీ బాట ప్రారంభంలో మహిళలు ఎమ్మెల్యేకు బొట్టు పెట్టి ప్రారంభించారు. డ్రైనేజీ సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరిత గతిన చేపట్టాలని కౌన్సిలర్‌లకు, అధికారులను ఆదేశించారు. ఇళ్లు లేని పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. స్కూల్ గ్రౌండ్‌లో పక్కన ఉన్న మురుగును తొలగించాలన్నారు. 12వ వార్డులో కొందరి ఇళ్లకు వెళ్లి ఆరోగ్యం బాగులేని పలువురిని పరమార్శించారు.

ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలుర హస్టల్‌ను సందర్శించి నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందుతుందా లేదా అని వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. అనంతరం గంజిరోడ్డులో పలు వ్యాపార దుకాణాలను, చిరువ్యాపారులను పలుకరించారు. వారి స్థితిగతులను ఆరా తీశారు. 15వ వార్డులో పర్యటించి పలు విషయాలను తెలుసుకున్నారు. బాలికల పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు జాగ్రత్తలు తీసుకునేలా ఉపాధ్యాయులు చూడాలన్నారు. గతంలో బోరు వేస్తానని హామీ ఇచ్చినందుకు, నూతనంగా వేస్తున్న తాగునీటి బోరును ప్రారంభించారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా వారి టమోటో ధరల గురించి అడిగిన ప్రశ్నలకు పమాదానాలు ఇచ్చారు. మన దేశంలో రైతుల కష్టాల గురించి వివరించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ రైతుల మీద చూపిస్తున్న శ్రద్ధ్ద, పథకాలపై తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల అనీల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేందర్, సోసైటీ ఛైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ భాస్కర్, మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకుడు ప్రవీణ్‌రెడ్డి, మున్సిప ల్ కమిషనర్ శ్రీనివాసన్, కౌన్సిలర్‌లు ఎదిరే కృష్ణ, మున్నీర్, వారాల ర వీందర్, వెంకటేష్, జేఏసి రవికుమార్, నాగేశ్వర్, తహేర్‌ఆలీ, మౌలానా, టౌన్ ప్రెసిడెంట్ కావలి లక్ష్మీ, కోఆప్షన్ శేఖర్, పట్టణ అధ్యక్షుడు మంగు స ంతోష్, నాయకులు భాస్కర్‌గుప్త, ఆకారపు రాజు, బషీర్, శ్రీనివాస్, ఆ సీ ఫ్,జ్యోతి,నితీన్,రఘువీర్,రాంరెడ్డి, ప్రవీణ్, రాకేష్, వెంకటేష్,పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News