Saturday, November 2, 2024

ప్రవళ్లిక కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి

- Advertisement -
- Advertisement -

విద్యార్ధులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రూపు- 2 పరీక్ష వాయిదా పడిందని మనస్థాపానికి గురై నిరుద్యోగ విద్యార్థిని ప్రవళ్లిక ఆత్మహత్య చేసుకోవడం బాధకరమని భారత విద్యార్ధి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం ఆ సంఘం అధ్యక్షులు ఆర్.ఎల్.మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో గత సంవత్సరం కాలంలో 8 మంది నిరుద్యోగుల ఆత్మహత్య చేసుకున్నారని యువత దైర్యంతో ఆనుకున్న లక్షం సాధించేవరకు ఎలాంటి కష్టం వచ్చిన సులువుగా ఎదుర్కొవాలని సూచించారు.

టిఎస్‌పిఎస్సీ పరీక్ష నిర్వహణలో లోపభూయిష్టంగా ఉందని, దానికి తోడు పారదర్శకంగా నిర్వహించకపోవడం లాంటివి జరుగుతుంటే మళ్ళీ సమయాన్ని పోడిగించడం అంటే ఆర్ధిక ఇబ్బందులు నిరుద్యోగులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోచింగ్ సెంటర్లకు లక్షల రూపాయలు చెల్లించి, హస్టల్స్ లో వేలాది రుపాయాలు ఖర్చు చేస్తూ నిరుద్యోగులు చదువుకుంటున్నారని, వారి ఇబ్బందులు ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేసి ఆదుకోవాలని, నిరుద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News