నాగర్‌కర్నూల్‌ర: దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభు త్వం సాధించిన విజయాలను ప్రదర్శించాలని దశాబ్ది ఉత్సవాల రాష్ట్ర నోడల్ అధికారి, రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్ ఎం. ప్ర శాంతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశా బ్ది ఉత్సవాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ని యమించిన దశాబ్ది ఉత్సవాల ఉమ్మడి జిల్లా నో డల్ అధికారిని, రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్ ఎం. ప్ర శాంతి గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్‌తో సమావేశంమై నాగర్‌కర్నూల్ జిల్లాలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణ రోజువారి కార్యక్రమాల ఏ ర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎం తో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 21వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సూచించారు. రా ష్ట్రం ఏర్పాటైన తొమ్మిదేళ్లలో నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక్కో శాఖ సాధించిన విజయాలను తెలియజేస్తూ ఘనంగా నిర్వహించేందుకు ఏ ర్పాట్లు చేశారని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ తెలిపారు.
గత తొమ్మిదేళ్లలో వాస్తవాలు, గణాంకాలు, విజయాలను వివరించే డాక్యుమెంటరీలను జిల్లా స్థాయిలో ప్రతి శాఖ తయారు చే యాలని ఆమె సూచించారు. 4 మున్సిపాలిటీల్లో అన్ని ముఖ్యమై న పబ్లిక్ స్మారక చిహ్నాలు, భవనాలు 21 రోజుల పాటు లైటింగ్ చేయాలన్నారు. జిల్లా స్థాయిలో జ రిగే కార్యక్రమాలే కాకుండా నియోజకవర్గ, మం డల స్థాయిలో కూడా ఇ లాంటి కార్యక్రమాలు ని ర్వహించనున్నారు. 21 రోజుల ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యం లో బందోబస్తు ఏర్పాటు చేయాలని అ దనపు ఎస్పి ని ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుం డా చూడాలన్నారు. అన్ని స్థా యిలో నిర్వహించే అన్ని కార్యక్రమాల వివరాలను మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆమె సూచించారు.రైతు దినోత్సవం, మహిళా ది నోత్సవం, సురక్ష దినోత్సవం ఏర్పాట్లపై కలెక్టర్‌ను అడిగి తె లుసుకున్నారు.జిల్లాలో 143 రైతు వేదికలలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
సురక్ష దినోత్సవం సం దర్భంగా నాగర్‌కర్నూల్ జి ల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన రక్షక్ వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలతో జిల్లా స్థాయిలో జిల్లా కేంద్రంలో భారీగా ర్యాలీ నిర్వహించి సురక్షిత గురించి ప్రజలకు వివరించనున్నట్లు అదనపు ఎస్పి తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్, అదనపు ఎస్పి రామేశ్వర్, ఆయుష్ జిల్లా అధికారి డా క్టర్ సూర్య నాయక్, డాక్టర్ అరుణ ఉన్నారు.