Friday, November 8, 2024

టీచర్ల బదిలీలపై స్టే ఎత్తేయాలన్న సర్కార్

- Advertisement -
- Advertisement -
విచారణ సోమవారానికి వాయిదా

హైదరాబాద్ : టీచర్ల బదిలీలపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. టీచర్ల బదిలీలలపై ఉన్నస్టే ఎత్తివేయక పోవడం వల్ల 80 వేల మంది ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారని అదనపు అడిషనల్ ఎజి హైకోర్టు దృష్టికి తెచ్చారు. టీచర్ల బదిలీలపై పిటిషన్లపై త్వరగా విచారణ జరపాలని అదనపు ఏజీ హైకోర్టును కోరారు. టీచర్ల బదిలీలపై ఉన్న స్టే ఎత్తివేత కోరుతూ మధ్యంతర పిటిషన్ కూడ వేసిన విషయాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. స్టే ఎత్తివేయాలన్న పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామన్న కోర్టు తెలిపింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల బదిలీల కోసం ఈ ఏడాది జనవరి 25న జీవో 5 జారీ చేసింది. ఈ జీవోను కొందరు ఉపాధ్యాయులు హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే విధించింది. ఈ స్టే పొడిగిస్తూ వస్తుంది. అయితే ఈ స్టేను ఎత్తివేయాాలని బిఆర్‌ఎస్ సర్కార్ కోరుతుంది. అయితే ఈ స్టేను ఎత్తి వేయవద్దని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరు తున్నారు. హైకోర్టు స్టే ఉన్నందున టీచర్ల బదిలీలపై అనిశ్చితి కొనసాగుతుంది. టీచర్ల బదిలీలు చేయాలని ఉపాధ్యాయుల నుండి డిమాండ్ నెలకొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది ఈ విషయమై స్టే ఎత్తివేయాలని హైకోర్టును కోరారు. దీనిపై సోమవారం విచారణ చేయనున్నట్టుగా హైకోర్టు వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News