Tuesday, January 21, 2025

అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

నిర్మల్ అర్బన్ : ఐటిడిఎ నిధులతో నిర్మల్‌లో ప్రారంభించబోతున్న మినరల్ మార్చర్, పాల ఫ్యాకింగ్ ఫ్లాంట్ కొరకు రూ. 56 లక్షలు మంజూరు కాగా గిరిజన దినోత్సవంలో భాగంగా ఆ చెక్కును రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖనాయక్‌లు మహిళ సంఘాలకు అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందన్నారు. ఏదో ఒక రూపంలో ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకొని అనేక అభివృద్ధ్ది కార్యక్రమాలు చేస్తుంటే అవి చూసి ఓర్వలేని కొందరూ విమర్శలు చేస్తున్నామరన్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం బిఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలువనుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు, డి.డి మధుసుధన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News