Wednesday, January 22, 2025

అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:అన్ని వర్గాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. శనివారం నాగారం మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిపి కూరం మణి వెంకన్న అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గంలో గృహలక్ష్మి పథకం కింద మహిళల పేరు మీద సొ ంతింటి నిర్మాణం కోసం 3లక్షల రూపాయలతో 3వేల ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

1100 మందికి దళిత బంధు, 1000 మందికి బీసీ రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ శా ఖలు చేపట్టిన పనుల పై ఆయా అధికారులతో చర్చించారు. పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చే యాలని ఆయా శాఖల అధికారులకు హెచ్చరించారు.

ఈ సమావేశంలో మార్కెట్ కమిటి ఛైర్‌పర్సన్ కొ మ్మినేని స్రవంతి, వైస్ ఎంపిపి గుంతకండ్ల మణిమాల, మార్కెట్ కమిటి వైస్ ఛైర్మన్ యారాల రామ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గుండగాని అంబయ్య గౌడ్, తహశీల్దార్ హరిశ్చంద్ర ప్రసాద్, ఎంపిడిఓ శోభారాణి, అధికారులు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News