Monday, December 23, 2024

తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్షం

- Advertisement -
- Advertisement -

కోట్‌పల్లి: ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ రైతుబంధు, రైతు బీమా, ఉచిత 24 గంటల విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తూ పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు కల్పించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా నూతన సంస్కరణలు చేపట్టి నాడు దండుగన్న వ్యవసాయాన్ని పండుగలా చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం కోట్‌పల్లి మండలంలోని మూడు క్లష్టలైన బుగ్గాపురం, రాంపూర్, బార్వాద్ గ్రామాల్లోని రైతుల ఎండ్ల బండ్లతో పాటు ట్రాక్టర్లు, ఆటాపాటలతో రైతులంతా పెద్ద ఎత్తున ర్యాలీగా రైతు వేధికల వద్ద రైతుల సమక్షంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు రైతుల కోసం ప్రభుత్వం చేసిన పథకాలను వివరించి రైతులకు శుభాకాంక్షలు తెలుపుకుని సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.

అందులో భాగంగానే బార్వాద్ గ్రామంలో ఏర్పాటు చేసిన వేధిక వద్ద రైతుల ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హాజరై రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే లక్షంగా పెట్టుకొని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో అ సాధ్యం అనుకున్నటువంటి సాగు నీరును సుసాధ్యం చేసే విధంగా కార్యధీక్షుడై తెలంగాణ పొలాలకు నీళ్లు మళ్లిస్తున్న అపర భగీరధుడు మన ముఖ్యమంత్రి కేసిఆర్ అని ఆయన కొనియాడారు. రైతుల రంధి తిర్చిన రైతుబాంధవుడు కేసిఆర్ అని ఆయన పేర్కోన్నారు.

దేశంలో కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తెస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతులను కంటికి రెప్పాల కాపాడుకుంటుంది నేడు తెలంగాణలో రైతే రాజుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు తెలంగాణలో నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనాని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల్ ఎంపిపి శ్రీనివాస్‌రెడ్డి, మండల్ పార్టీ అధ్యక్షులు అనిల్, మండల్ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు వెంకటేష్‌యాదవ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు లక్ష్మివెంకటయ్య, రాంచెందర్, అనితాగోపాల్‌రెడ్డి, రాధక్రిష్ణ, మల్లయ్య, సావిత్రిగౌడు, చంద్రకళపాపిరెడ్డి, విజయలక్ష్మి, పాం డురంగారెడ్డి, పద్మనాగర్జున్‌రెడ్డి, వెంకటశం, సూర్యకళమాణిక్యం, చంద్రకళపెంటారెడ్డి, ఎంపిటిసిలు, రైతుబంధు మండల్ అథ్యక్షులు స త్యం, మండల్ స్థాయి అధికారులు, మండల్ వ్యవసాయాధికారులు, గ్రామాల రైతుబంధు అధ్యక్షులు, నాయకులు వెంకటశం, కృష్ణ మాణిక్యం, మైబు, ఎల్లయ్యగౌడు, నాగర్జున్‌రెడ్డి, ఆయా గ్రామాల కార్యదర్శులు రైతులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News