Monday, December 23, 2024

గవర్నర్ ట్వీట్లు నన్ను బాధించాయి

- Advertisement -
- Advertisement -

The governor's tweets hurt me:Mamatha

ప బెంగాల్ సిఎం మమత వ్యాఖ్య

కోల్‌కత: రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనఖర్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచు విమర్శలు గుప్పించడంపై మనస్థాపం చెందినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అందుకే గవర్నర్ ధన్‌ఖర్‌ను ట్విటర్‌లో బ్లాక్ చేసినట్లు సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని, పోలీసు డైరెక్టర్ జనరల్‌ను గవర్నర్ అనేక సందర్భాలలో బెదిరింపులకు పాలడినట్లు ఆమె తెలిపారు. గవర్నర్ పదవి నుంచి ధన్‌ఖర్‌ను తొలగించాలని తాను అనేక సార్లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశానని ఆమె చెప్పారు. అయితే, ఇప్పటివరకు ఆయనపై ఎటువంటి చర్య తీసుకోలేదని ఆమె విచారం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News