Wednesday, December 25, 2024

ఘనంగా తొలి ఏకాదశి పర్వదినం

- Advertisement -
- Advertisement -

గద్వాల : జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండలాల్లోను గురువారం తొలి ఏకాదశి పండగును ఘనంగా జరుపుకున్నారు. ఆషాడమాసంలో వచ్చే మొదటి పండుగ అని, దీనిని శయన ఏకాదశిగా అని కూడా పిలుస్తుంటారు. పలు చోట్ల ఆలయాలకు తెల్లవారుజాము నుంచే స్థానిక భక్తులు పోటేత్తారు. భక్తిశ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల తాకిడితో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకార్యలు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.

మల్దకల్ మండలం కేంద్రంలో వెలసిన స్వయంభూ శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారిని బిజెపి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, తదితరులు, గద్వాల డీఎస్పీ రంగస్వామి స్వామి, తదితరులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేటిదొడ్డి మండలం పాగుంటా శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని అర్చకులు అందంగా ముస్తాబుచేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

స్వామి వారిని దర్శించుకున్న ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జీ
తొలి ఏకాదశి సందర్భంగా కేటిదొడ్డి మండలం పాగుంట శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో గద్వాల కోర్టు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జీ గంట కవితాదేవి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ చరిత్రను ఆలయ అర్చకులు ఆమెకు వివరించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమె వెంటా కేటిదొడ్డి ఎస్‌ఐ వెంకటేష్, కోర్టు సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News