Friday, November 15, 2024

దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన మహానేత పివి

- Advertisement -
- Advertisement -

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
తెలంగాణ భవన్‌లో ఘనంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి

మన తెలంగాణ / హైదరాబాద్ : మాజీ ప్రధాని పివి నరసింహారావు ప్రధానిగా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అలాంటి పివి తెలంగాణలో పుట్టడం గర్వంగా భావిస్తున్నానన్నారు.  న్యూఢిల్లీ లోని తెలంగాణ భవన్‌లో శనివారం మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 19వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిధిగా హాజరయ్యి పివి నరసింహారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ చిన్న నాటి నుంచే పివికి దేశం అంటే చాలా ప్రేమ అని అన్నారు. ఆయనకు అనేక భాషలపై మంచి పట్టుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూసంస్కరణల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న మహానుభావుడు పివి నరసింహారావు అని అన్నారు. పివి నరసింహారావు ఎన్నో గొప్ప సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. పివి పాలనా దక్షత ఇతర రాష్ట్రాలకు ఉదాహరణగా నిలిచిందని కొనియాడారు. ,ఆయన పాలనా అనుభవం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు, దేశం ఆర్థికంగా, రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా పివి కీలక భూమిక పోషించారన్నారు. పివి పాలనా దక్షత అనితర సాధ్యమని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. పివి ఆలోచనలను, మార్గాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భవిష్యత్ తరాలు నడుం బిగించడమే, మనం ఆయినకిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Bhatti 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News