Friday, November 15, 2024

అమెరికాలో రాజీనామాల వెల్లువ

- Advertisement -
- Advertisement -
great resignation
‘ద గ్రేట్ రిజిగ్నేషన్’ సంక్షోభం

వాషింగ్టన్: అమెరికా కార్మిక గణాంకాల బ్యూరో ప్రకారం 2021 జులై నాటికి 40లక్షల మంది అమెరికన్లు తమ ఉద్యోగులు వదులుకున్నారు. గత కొన్ని నెలలుగా ఇలా ఉద్యోగాలు వదిలేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఉద్యోగులను ఎలా నిలుపుకోవాలన్నది కంపెనీ యజమానులకు ఇప్పుడో పెద్ద సవాలుగా తయారయింది.

ఉద్యోగులు ఎందుకిలా ఉద్యోగాలు మానేస్తున్నారు అన్నదానిపై ఓ లోతైన విశ్లేషణ జరిగింది. 4000కు పైగా కంపెనీల్లో 90 లక్షల మంది ఉద్యోగుల రికార్డులు పరిశీలించారు. 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఉద్యోగులే ఎక్కువగా రాజీనామాలు చేస్తున్నారన్నది మొదటి అంశం. వీరంతా తమ బ్రేకింగ్ పాయింట్ రీచయిన వారే. నెలల తరబడి అత్యధిక వర్క్ లోడ్‌ను మోసినవారే.
టెక్నాలజీ, ఆరోగ్య రంగాల్లో రాజీనామాలు ఎక్కువగా ఉండడం విశ్లేషణలో తేలిన రెండో అంశం. కరోనా మహమ్మారి కాలంలో వీరికి డిమాండ్ బాగా పెరిగింది. ఆయా సంస్థలో ఏళ్ల తరబడి నమ్మకంగా పనిచేసినప్పటికీ కష్టకాలంలో యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం కూడా ఈ రాజీనామాలకు ఒక కారణం. సుదీర్ఘమైన షిఫ్ట్‌లు, లేఆఫ్‌లు, వేతనకోతలతో కంపెనీలు తమను ఎక్కువగా వాడుకుంటున్నాయన్న భావన ఉద్యోగుల్లో పెరిగింది. ఇప్పుడు కరోనా వ్యాప్తి తగ్గి వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. కంపెనీలు ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తామన్నా, ప్యాకేజీలు ఇస్తామన్నా ఉద్యోగులు ఉండడం లేదు. ఆగస్టులో నమోదైన రాజీనామాల్లో 40 శాతం రెస్టారెంట్లు, హోటళ్ల రంగానికి చెందినవే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News