Wednesday, January 22, 2025

పచ్చదనం పరిఢవిల్లుతోంది

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : అంతరించిపోతున్న అడవులకు హరితహారంతో సీఎం కేసీఆర్ ఊపిరినిచ్చారని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. సోమవారం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలోని పల్లె ప్రకృతి వనంలో దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని హరితోత్సవ వేడుకలను నిర్వహించారు. తొలుత ప్రజాప్రతినధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉమ్మడి పాలనలో పల్లెలు బోసిబోయి కనిపించాయని, స్వరాష్ట్రంలో పచ్చదనాన్ని పరుచుకున్నాయన్నారు.

2015 జూలై 3న సీఎం కేసీఆర్ చేతులమీదుగా హరితహారం ప్రారంభమై ఓ యజ్ఞంగా నిర్విజ్ఞంగా కొనసాగుతుందన్నారు. ఊరురా నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేపించి 20 కోట్లకు పైగా మొక్కలను నాటించడం జరిగిందన్నారు. హరితహారంలో ప్రజలను భాగస్వామ్యులను చేయడంతో పెద్ద ఎత్తున్న మొక్కలను నాటి సంరక్షించడంతో వృక్షాల సంఖ్య అమాం తం పెరిగిందన్నారు. నాడు 18.5 శాతం ఉన్న అడవి విస్తీర్ణం నేడు 23.14 శాతానికి పైబడి చేరిందన్నారు. జీవకోటికి ప్రాణవాయువు, ప్రకృతి సమతూల్యత మూగ జీవాలకు నిలువు నీడ ఆహారం దొరుకుతుందన్నారు.

మొక్కల పెంపకాన్ని నోటి మాటలుగా కాకుండా చట్టంగా పొందుపర్చడంతో సత్ఫలితాలనిచ్చాయన్నారు. దీంతో ఎవెన్యూ ప్లాంటేషన్, మొక్కల పెంపకం చేపట్టడంతో వృక్షాలు వృద్ధి చెందాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసిన పచ్చదనం పరిమరిల్లుతుందన్నారు. ప్రకృతి పచ్చబడటంతో సకాలంలో వర్షాలు కురిసి బీడు భూములు పచ్చాండాలతో విరజిల్లుతున్నాయన్నారు. కరువుకు నిలయంగా ఉన్న పుడమి ఇప్పుడు పచ్చదనాన్ని పరుచుకుని ఆదర్శంగా ఉన్నాయన్నారు. పచ్చదనానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతతోనే ఇంతటి గొప్ప ఘనతను సాధించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ విద్యాచందన, అడిషనల్ పీడీ శిరీష, ఇరిగేషన్ డీఈ వెంకటశాస్త్రి, ఏఈలు అరుణ, మన్డేప్, ఏసీపీ బస్వారెడ్డి, సీఐ రాజిరెడ్డి, ఎస్‌ఐ వెంకటకృష్ణ, ఎంపీడీఓ అశోక్, ఎంపీఓ రాజారాం, ఏఓ నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు బెల్లం వేణు, నుడా డైరెక్టర్ గూడా సంజీవరెడ్డి, ఏదులాపురం సొసైటీ చైర్మన్ జర్పుల లక్ష్మణ్, మారెమ్మగుడి చైర్మన్ మట్ట వెంకటేశ్వర్లు, ఆర్‌ఎస్‌ఎస్ కన్వీనర్ అక్కినపల్లి వెంకన్న, సర్పంచ్ కర్లపూడి సుభద్ర, ఉపసర్పంచ్ నల్లపునేని రమణయ్య, ఎంపిటీసీ గొడ్డుగొర్ల వెంకటేశ్వర్లు, బీఆర్‌ఎస్ నాయకులు నల్లపునేని భాస్కర్రావు, షేక్ మైబల్సబ్, వెంపటి రవి. గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News