Thursday, December 19, 2024

ఆరు గ్యారంటీలతో పేదల కష్టాలు దూరం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పాలనలోనే ఎన్నో ప్రాజెక్టులు నిర్మించాం
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడేది మా పార్టీనే
దుబ్బాక ‘విజయభేరి’ మహాసభలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

మన తెలంగాణ/దుబ్బాక: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసి పేదల కష్టాలు తీర్చుతామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.. గురువారం దుబ్బాక పట్టణంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన విజయభేరి సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని దుబ్బాకకు రాష్ట్రంలోని ఒక చరిత్ర ఉందని బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమాల గడ్డ దుబ్బాక అని తెలిపారు. నీతి నిజాయితీకి మారుపేరు చెరుకు ముత్యం రెడ్డి కుటుంబం అన్నారు. దుబ్బాక ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు మూడేళ్ల కాలంలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం నుండి ఒక రూపాయి కూడా దుబ్బాక అభివృద్ధికి తేలేదని విమర్శించారు.

కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని వాటికి ఇప్పటికీ మంచి గుర్తుంపు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి ఒక్కసారి అధికారం ఇచ్చి కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంటుందో చూడాలని రేవంత్‌రెడ్డి కోరారు. నాటి నుంచి నేటి వరకు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమన్నారు. మల్లన్న సాగర్‌లో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగాలని సుప్రీంకోర్టులో పోరాడిన కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News