మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం జగన్ అవినీతికి పాల్పడ్డారని, దీనిపై విచారణ జరపాలంటూ వైసిపి రెబల్ ఎంపి రఘురామకృష్ణ రాజు ఎపి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ మొదలైంది. సిఎం జగన్ అవినీతికి పాల్పడ్డారని పిటిషనర్ తరఫు లాయర్ ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. సిబిఐ కేసులో తనతో పాటు ఉన్నవారికి ప్రయోజనం చేకూరేలా వ్యవహరించారన్నారు. అయితే ప్రభుత్వం తరఫున ఎజి కౌంటర్ వాదనలు వినిపించారు.
పిటిషనర్ రఘురామకృష్ణ రాజు పిల్ వేసేందుకు అనర్హుడని వాదించారు. పిటిషనర్, సిఎంకు మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. పిటిషనర్‌పై క్రిమినల్ కేసులు నమోదయిన విషయం బయటకు చెప్పలేదన్నారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు మార్చి 4కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కాగా సిఎం జగన్ అవినీతికి పాల్పడ్డారని, తన అనుయాయులకు ప్రయోజనం కలిగించేలా నిర్ణయాలు తీసుకున్నారని ఎంపి రఘురామకృష్ణరాజు ఆరోపించారు. దీనిపై కేంద్రం దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ జరిపించేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.