Monday, December 23, 2024

రాష్ట్రంలో టీచర్ల బదిలీలపై ఈ నెల 19 వరకు హైకోర్టు స్టే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 19 వరకు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీలస్టే కోర్టు స్టే విధించింది. అప్పటివరకూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు తర్వాతే బదిలీలు చేయాలని రంగారెడ్డి టీచర్ల తరపున దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ జువ్వాడి శ్రీదేవి బెంచ్ విచారణ చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాది బాలకిషన్‌రావు వాదనలు వినిపించగా వాదనలు విన్న జస్టిస్ జువ్వాడి శ్రీదేవి టీచర్ల బదిలీ ఈ నెల 19 వరకు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మల్టీజోన్-1, 2 పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ సెకండరీ గ్రేడ్ టీచర్స్, మల్టీజోన్-2 పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ టీచర్ల బదిలీలకు అవకాశం కల్పించింది.

అక్టోబరు 4 వరకు అప్పీలు, ర్యాంకుల దిద్దుబాటు, ఖాళీల సవరణల అప్‌డేట్‌కు అధికారులు అవకాశం కల్పించగా అక్టోబరు 5న తుది సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని ఇటీవల చెప్పారు. తెలంగాణలో టీచర్ల బదిలీలకు సంబంధించి షెడ్యూలును విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది. రెండు మల్టీజోన్లలో పదోన్నతులు పక్కనపెట్టి.. కేవలం బదిలీలు మాత్రమే పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం (అక్టోబరు 3న) బదిలీలకు సంబంధించిన షెడ్యూలును ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాల్లో సీనియార్టీపై, పదోన్నతులకు టెట్ అర్హత కేసులు, పదోన్నతులపై స్టేలు ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 3 నుంచి 8 వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరు 6, 7 తేదీల్లో బదిలీలకు సంబంధించిన వెబ్‌‌‌ఆప్షన్‌కు అవకాశం ఇచ్చారు. అక్టోబరు 8న వెబ్‌‌‌ఆప్షన్ల సైతం ఎడిట్ చేసుకునే వీలు కల్పించింది. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న తర్వాత ఖాళీల పాయింట్లు, స్పౌజ్ పాయింట్లు ఎలాంటి మార్పులుండవని అధికారులు స్పష్టం చేశారు. కానీ అనూహ్యంగా టీచర్ల బదిలీలను అక్టోబర్ 19 వరకు నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News