Wednesday, January 22, 2025

ఫిబ్రవరి ఎండలు ఎల్‌నినోతోనే: స్కైమెట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇప్పుడు ఫిబ్రవరి నెల పూర్తికాకముందే దేశంలో పలుప్రాంతాలలో నెలకొన్న అత్యధిక ఉష్ణోగ్రతలు కమ్ముకుంటున్న ఎల్‌నినోతోనే అని స్పష్టం అవుతోంది. ఎల్‌నినో భారతదేశ వ్యవసాయానికి, వాతావరణానికి ముప్పుగా మారుతుందని వాతావరణ పరిశోధనల సంస్థ స్కైమెట్ తెలిపింది. సాధారణంగా ఫిబ్రవరిలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలతతో పోలిస్తే ఈసారి సాధారణం కన్నా 6 నుంచి 10 డిగ్రీల వరకూ ఎక్కువగా రికార్డు అయ్యాయి. ఇది తగ్గే వర్షాలకు పంట దిగుబడిలో అల్పాలకు సూచకం అని ఈ సంస్థ నిపుణులు తెలిపారు. ఈసారి తలెత్తే వాతావరణ ప్రభావంతో దేశ వ్యవసాయ రంగంపై పెను ప్రభావం పడుతుంది, తగ్గే వర్షాలతో వర్షాధారిత పంటల దిగుబడికి గండిపడుతుంది. ఈసారి ఫిబ్రవరిలోనే ఎక్కువ వేడిమి వాతావరణం పరంగా అత్యంత ప్రతికూల పరిణామం అని స్కైమెట్ సంస్థ ప్రెసిడెంట్ జిపి శర్మ తెలిపారు.

సాధారణంగా క్రమపద్ధతిలో చూస్తే వేసవికి శీతాకాలానికి మధ్య ఉండే ఆకురాలు కాలం అత్యంత ప్రధానమైనది, అయితే వీటి మధ్య ఇప్పుడు ఉండాల్సిన వ్యత్యాససం ఇప్పుడు గణనీయంగా తగ్గింది. ఇది వాతావరణ పరంగా నెలకొంటోన్న అసాధారణ పరిస్థితి అని తెలిపారు. వాతావరణంలో మార్పులతో గోధుమలు ఆవాల పంటలకు విఘాతం ఏర్పడుతుంది. రబీ పంటలకు వాతావరణం ఎక్కువగా శీతలంగా ఉండాలి. దీనితోనే పంటదిగుబడి బాగా ఉంటుంది, కానీ దీని బదులుగా రబీ పంటలు ఇప్పటికే వేడిమి ప్రభావానికి గురి కావడంతో దిగుబడిపై దుష్పలితాలు ఉంటాయని శర్మ వివరించారు. గత మూడేళ్లుగా దేశంలో నెలకొంటూ వచ్చిన లానినా పరిస్థితి ఇక ముగిసే దశలో ఉంది. దీనితో వాతావరణం ప్రతికూల పరిస్థితికి దారితీస్తుంది. సముద్రం సాధారణంగా ఎటువంటి వాతావరణ పరిస్థితిని అయినా చాలాకాలం తనలోనే ఇముడ్చుకుని ఉంటుంది. అయితే రుతుపవనాల ఆగమన కాలం దశలోనే ఎల్‌నినో తీవ్రస్థాయికి చేరుకోవడం ప్రధాన వాతారణ సంక్లిష్టతకు దారితీస్తుందని స్కైమెట్ నిపుణులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News