- Advertisement -
నారాయణపేట ప్రతినిధి: ఈ నెలాఖరులోపు ఓటర్ల ఇంటింటి సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బీఎల్‌ఓలను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఎస్‌ఎస్‌ఆర్ 2023 ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ విడుదలపై సమావేశం నిర్వహించి ఈ నెలాఖరులోపు మార్పులు చేర్పులు సర్వే పూర్తి చేయాలన్నారు. ప్రతి రోజు 40 నుండి 50 ఇండ్లు వరకు బీఎల్‌ఓలు సర్వే చేయాలన్నారు.
ఎపిక్ కార్డు కోసం వర్క్ ఆర్డర్ ఇవ్వాలన్నారు. రూట్ మ్యాప్ తయారు చేసి సెక్టోరియల్ అధికారి ఆధ్వర్యంలో ప్రణాళిక తయారు చేయాలన్నారు. ట్రాన్స్ జెండర్ ఓటర్లు లేరని ఫారం 6,7 సరి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మయాంక్ మిత్తల్ , ఆశోక్‌కుమార్ , ఆర్డీఓ రామచందర్, ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -