Monday, December 23, 2024

ఇంటింటి సర్వేను 23 నాటికి పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్టా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటరు ధృవీకరణ కొరకు ఇంటింటి సర్వేను ఈ నెల 23 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల ఎన్నికల అధికారులతో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్టా జిల్లాలో ఎన్నికల పనులను ప్రారంభించాలన్నారు. ఓటరు జాబితా ధృవీకరణ కొరకు మరొసారి ఇంటింటి సర్వేను నిర్వహించి ఈ నెల 23లోగా పూర్తి చేయాలన్నారు. సర్వే అనంతరం జాబితాలో సవరణ పనులు చేట్టాలన్నారు.

జిల్లాలోని నియోజకవర్గాలలోని మండలాల వారీగా ఫామ్ 6, 7, 8లకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించాలని, మరణించిన ఓటరు మరణ ధృవీకరణ ప త్రం పరిశీలించిన తరువాత మాత్రమే జాబితా నుండి పేరు తొలగించాన్నారు. పేరు, ఫోటో సవరణలు చేపట్టాల్సినవి ఉన్నట్లయితే వాటిని కూడా పూర్తి చేయాలన్నారు.

నియోజకవర్గాల వారీగా రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, టైని కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్సో, కరీంనగర్, హుజురాబాద్ ఆర్డీవోలు ఆనంద్‌కుమార్, హరిసింగ్, డీఆర్డీవో శ్రీలత, తహసిల్దార్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News