Monday, December 23, 2024

డ్రోన్లు, జాగిలాలతో ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం

- Advertisement -
- Advertisement -

పూంచ్ /జమ్ము : జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో గురువారం ఆర్మీ వాహనంపై గ్రెనేడ్ దాడి చేసి ఐదుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. డ్రోన్లు, స్నిఫర్ జాగిలాలతోపాటు హెలికాప్టర్‌తో కూడా గాలిస్తున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్)డైరెక్టర్ జనరల్ ఎస్‌ఎల్ థావోసేన్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఎడిజిపి)ముఖేష్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) సంఘటన ప్రదేశాన్ని సందర్శించారు. సరిహద్దు పొడుగునా పర్యవేక్షించారు. ఈ సంఘటనకు సంబంధించి విచారించడానికి 14 మందిని అదుపు లోకి తీసుకున్నారు.

భాటా ధురియన్ టోటాగలి, సమీప ప్రాంతాల్లో దాక్కున్న ఉగ్రవాదులను ఖతం చేయడానికి ఆ ప్రాంతమంతా జల్లెడపడుతున్నారు. దట్టమైన అడవీ ప్రాంతంలో ఉగ్రవాదులు మందుపాతరలు అమర్చి పేలుడుకు పాల్పడే ప్రయత్నాలు చేయవచ్చని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భింబేర్ గలీ పూంచ్ రోడ్డుపై ట్రాఫిక్‌ను ఆపేశారు. పూంచ్‌కు వెళ్లే వారు మెందార్ రూట్లో వెళ్లాలని సూచించారు. ముగ్గురు లేక నలుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పన్నాగం పన్ని ఉంటారని భావిస్తున్నారు. ఉగ్రవాదులు వినియోగించిన బుల్లెట్లను కూడా కనుగొన్నారు. నియంత్రణ రేఖ వద్ద నిఘా పటిష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News