Monday, December 23, 2024

భార్యతో గొడవ పడి భర్త అదృశ్యం

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్ : మద్యానికి బానిసైన భర్తను తాగొద్దని వారించడంతో ఇరువురి మధ్య గొడవ జరిగి ఇంటి నుంచి బయటకు వెళ్లిన భర్త తిరిగిరాని సం ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం… బాలాజీనగర్ జ్యోతి కాలనీ పరిధిలోని రామాలయం సమీపంలో దొంగిల్ దేవిదాస్ నా గ నాథ్(31),దొంగిల్ లావణ్య భార్యా భర్తలు నివాసం ఉంటున్నారు. దేవాదాస్ నాగనాథ్ టైలర్ పని చేస్తుండగా,లావణ్య బీడీ తయారి వృత్తితో జీవిస్తుంది.కాగా దేవిదాస్ నాగనాథ్ మద్యానికి అలవాటు పడి పని చేయకుండా తరుచు భార్యతో గొడవపడుతుండేవాడు.దీంతో మంగ ళవార ం భార్యాభర్తల మద్య గొడవ జరిగి భర్త దేవిదాస్ నాగనాథ్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.గతంలో కూడా ఇంటి నుంచి వెళ్లి తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయని భార్య తెలిపింది.అయితే భర్త కోసం భార్య పలు ప్రా ంతాలలో,బందువుల ఇళ్లలో వెతికిన ఆచూకి లభ్యం కా లేదు. బుధవారం భర్త ఆచూకి కోసం జవహర్‌నగర్ పోలీస్‌లకు భార్య ఫిర్యాదు చేసింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకోని ధర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News