Monday, January 20, 2025

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

చెన్నూర్: చికెన్ వండమని కోరితే వంకాయ కూర వండిందని భార్యను అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన సంఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక సిఐ వాసుదేవరావు తెలిపిన వివిరాల ప్రకారం… కిష్టంపేట గ్రామానికి చెందిన గాలిపెల్లి పోచయ్య తరచూ మద్యం తాగి భార్య శంకరమ్మ(45)తో గొడవ పడుతుండేవాడు. నిన్న (బుధవారం) రాత్రి చికెన్ కూర వండమని సూచించగా శంకరమ్మ వంకాయ కూర వండింది. ఈ విషయంపై భార్యతో పోచయ్య గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలోనే మాటామాట పెరిగి శంకరమ్మను గొడ్డలితో నరికి హత్య చేశాడు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు ఫిర్యాదు పోలీసులు మేరుకు కేసు నమోదు దర్యాప్తు చేస్తునట్లు సి.ఐ.తెలిపారు. ఈ సందర్భంగా సిఐ వాసుదేవరావు మాట్లాడుతూ ఒకప్పుడు భార్యభర్తల మధ్య గొడవలు సహజంగానే జరుగుతుండేవని కానీ ఈ మధ్యకాలంలో గొడవలు కాస్త హత్యలకు దారితీస్తున్నాయని అన్నారు. గొడవలు జరిగే సమయంలో కొంత సహనం వహిస్తే ఇటువంటి అనార్థాలకు దారితీయవని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News