Friday, January 10, 2025

రోగిని కాళ్లు పట్టుకొని లాక్కెళ్లిన ఘటన.. ఖండించిన ఆస్పత్రి సూపరింటెండెంట్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ దవాఖానలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్ట్రెచర్‌ లేకపోవడంతో రోగి కాళ్లను పట్టుకుని లిఫ్ట్‌ వరకు లాక్కెళ్లారు రోగి బంధువులు. ఈ ఘటనను కళ్లారా చూస్తున్నా.. ఆస్పత్రి సిబ్బంది స్పందించలేదు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రభుత్వ దవాఖానలో రోగిని సహాయకులు కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన దృశ్యాలు వైరల్‌ కావడం పట్ల ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ స్పందించారు. ఆస్పత్రికి వచ్చిన రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వచ్చిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. సదరు రోగిని సహాయకులు మార్చి 31వ తేదీని ఆస్పత్రికి తీసుకొచ్చారని సూపరింటెండెంట్‌ తెలిపారు. లిఫ్ట్‌ వచ్చిందన్న తొందరలో సహాయకులే రోగి కాళ్లు పట్టుకుని లాక్కెళ్లారని పేర్కొన్నారు. అది గమనించిన సిబ్బంది వాళ్లను వారించి వీల్‌ఛైర్‌లో తీసుకెళ్లారని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News