- Advertisement -
ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతానికి దౌత్య సిబ్బంది
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని మూసి వేశారని, భారత రాయబారి, దౌత్య సిబ్బంది అంతా కూడా దేశంలోని పశ్చిమ ప్రాంతానికి వెళ్తున్నారని విశ్వసనీయ వర్గాలు మంగళవారం తెలిపాయి. కీవ్‌పై రష్యా దాడి తూర్పు ప్రాంతంనుంచి జరుగుతుండడంతో, భారత్ తన విద్యార్థులను పశ్చిమ సరిహద్దులకు వెళ్లాల్సిందిగా సలహా ఇస్తుండడం తెలిసిందే. కీవ్‌లోని భారతీయులంతా కూడా నగరం వదిలి వెళ్లిన తర్వాత కీవ్‌లోని భారత దౌత్యా కార్యాలయాన్ని మూసి వేయడం గమనార్హం.
- Advertisement -