Monday, December 23, 2024

‘అగ్ని’ గుండం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/లక్ష్మణచాంద (నిర్మల్ జిల్లా) : రాష్ట్రంలో ఎండలు ముదురు తున్నాయి. ఏప్రిల్ రెండవ వారంలోనే 40డిగ్రీల ఉష్ణోగ్రతలు మించుతున్నాయి. రాష్ట్రంలో కిందిస్థాయిలో గాలులు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నాయని , దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణ అంతటా పొడి వా తావరణం ఉండే అవకాశం ఉందని హై దరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండ తీవ్రతను తట్టుకోలేక నిర్మ ల్ జిల్లా లక్ష్మణచాంద మం డలం నర్సాపూర్(డబ్లు) గ్రామంలో ఉపాధి కూలీ మర ణించాడు. కాగా పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమేపిపెరుగుతున్నాయి.ఉదయం నుంచే ఎండల తీవ్రత అధికమవుతోంది. మధ్యాహ్నానికి ఇది మరిం త తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ఈనెల ప్రారంభం నుంచే ఎండల తీవ్రత పెరిగింది. ఈసారి ఇది మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయి. రా ష్ట్రంలోని 15 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలలు 41డిగ్రీలు న మోదవుతున్నాయి.వరంగల్, హనుమకొండ జిల్లా ల్లో గత రెండు రోజులుగా పె రిగిన పగటి ఉష్ణోగ్రతలతో పొలా ల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీ లు,ఉపాధిహా మీ పథకం కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.

పెరిగిన ఎండలతో జనం ఇళ్ల నుంచి వీధుల్లోకి వచ్చేందుకు జంకుతున్నారు. అత్యవసర పనివుంటే తప్ప మ ధ్యాహ్నం 12దాటితే జనం బయటకు రావటం లేదు. పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గరిష్టంగా నిర్మల్ జిల్లా దస్తూరిబాద్‌లో 42.8డిగ్రీలు నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో 42.7, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 42.5, సూర్యాపేట జిల్లా హూజూర్‌నగర్ , జోగులాంబగద్వాల జిల్లా అలంపూర్‌లో 42.4, జగిత్యాల జిల్లా మల్లాపూర్,మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 42.2, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి, నిజామాబాద్ జిల్లా మక్లూర్ ,వనపర్తి జిల్లా పాన్‌గల్ , కేతిపల్లిలో 42.1డీగ్రీలు చొప్పున నమోదయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని మర్తాన్‌పేట, జగిత్యాల జిల్లా వెల్లటూర్‌లో 41.9డిగ్రీలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో 37.7డిగ్రీలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ హెచ్చరించింది. ప్రజలు ఎండల నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది. మరో రెండు రోజులు రాష్ట్రంలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు ఐఎండి హెచ్చరించిన నేపధ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ణప్తి రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ విజ్ణప్తి చేసింది.

నిర్మల్ జిల్లాలో ఎండ తీవ్రతకు ఉపాధి కూలీ మృతి

ఎండత తీవ్రత తట్టుకోలేక ఉపాధిహామీ కూలీ మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా, లక్ష్మణచాంద మండలంలోని నర్సాపూర్ (డబ్లు) గ్రామంలో చోటు చేసుకుంది. తోటి కూలీలు, స్థానికుల వివరాల ప్రకారం … నర్సాపూర్(డబ్లు) గ్రామానికి చెందిన పడిగెల రవి (45) అనే వికలాంగుడు మంగళవారం ఎప్పటిలాగే ఉపాధిహామీ పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగానే కళ్లు తిరిగి కింద పడిపోయాడు. గమనించిన తోటి కూలీలు నీళ్లు తాగించే ప్రయత్నం చేసినప్పటికీ కోలుకోలేదు. అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై రాహుల్ గైక్వాడ్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య రాజమణితో పాటు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే ఉపాధిహామీ పని ప్రదేశాలలో కూలీలకు కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News