Monday, December 23, 2024

జూవెల్లరీ షాపు రాబరీలో దర్యాప్తు ముమ్మరం 

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలోని జూవెల్లరీ షాపు దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తు మ్మురం చేశారు. ఐటి అధికారుల పేరుతో బాలాజీ జూవెల్లరీ షాపులోని 1,700 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఐదుగురు వ్యక్తులు ఆదాపు పన్ను అధికారులమని చెప్పి షాపుకు వచ్చారు. వచ్చిరాగానే షాపులోపనిచేస్తున్న ముగ్గురు వర్కర్లు, యజమాని బావమర్దిని ఓ చోట ఉంచి కదలనివ్వలేదు. ఐటి కట్టకుండా బంగారాన్ని విక్రయిస్తున్నారని చెప్పి షాపులోని 1,700 బంగారు బిస్కెట్లను తీసుకుని పారిపోయారు. జూవెల్లరీ షాపు మహారాష్ట్రకు చెందిన వారిది కాగా నిందితులు కూడా అదే రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఐటి అధికారులు నోటీసులు ఇస్తారు కానీ చోరీ చేయరని బంగారం షాపు నిర్వహిస్తున్న ఎవరికైనా తెలుసు. కాని షాపులో ఉన్న వారు ఐటి అధికారుల పేరు చెప్పగానే బంగారాన్ని సీజ్ చేస్తున్నామని వారు చెప్పగానే ఇచ్చి వేశారు. దీనిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు బంగారాన్ని తీసుకుని ఆటోలో జెబిఎస్‌కు వెళ్లి అక్కడి నుంచి బస్సులో షోలాపూర్‌కు వెళ్లినట్లు గుర్తించారు. సిసిటివిలో నిందితులు కూకట్‌పల్లి అటు నుంచి పటాన్ చెరు మీదుగా మహారాష్ట్రకు వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. ఫిర్యాదు రాగానే వెంటనే రంగంలోకి దిగిన నార్త్ జోన్ పోలీసులు డిసిపి చందనాదీప్తి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసుకుంటూ నిందితులు వెళ్లిన రూట్‌లోనే షోలాపూర్‌కు చేరుకున్నారు. అక్కడ నిందితుల కోసం వెతుకుతున్నారు. ఈ కేసులో జూవెల్లరీ షాపు యజమాని మధూకర్, షాపులో పనిచేస్తున్న ముగ్గురు వర్కర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలిసిన వారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మార్కెట్ ప్రాంతంలో చాలా జూవెల్లరీ షాపులు ఉన్నా కూడా నిందితులు ఈ షాపును రాబరీకి ఎందుకు ఎంచుకున్నారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News